Perni Nani: కూటమి మద్యం పాలసీ రెడ్ బుక్ రూల్ ప్రకారమే నడుస్తోందా? 6 d ago

AP: ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు మంచి నీళ్లకు అల్లాడిపోతుంటే మరొకవైపు, మద్యం మాత్రం ఏరులై పారుతోందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో 10 నెలల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా అవుతుందని సీరియస్ అయ్యారు. సోమవారం తాడేపల్లిలోని YSRCP ప్రధాన కార్యాలయం నుంచి పేర్ని నాని మాట్లాడుతూ.. ' YSRCP దిగిపోయే నాటికి గోదాంల్లో ఉన్న మద్యాన్ని TDP ప్రభుత్వం అమ్మింది. ఈ నేపథ్యంలో గోదాంల్లో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయించలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన మీరు ఆ డిస్టరీలను ఎందుకు రద్దు చేయలేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటైనా డిస్టలరీను రద్దు చేసిందా?' అని నాని ప్రశ్నించారు.
'కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వైఎస్సార్ సీపీకి చెందిన ఆస్తులను ధ్వంసం చేశాయని దుయ్యబట్టారు. ఈ మేరకు కేరళ, బెంగళూరు ఎక్కువగా అమ్మని మద్యం.. మరీ ఏపీలో మాత్రం ఎందుకు మద్యాన్ని ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ రెడ్ బుక్ రూల్ ప్రకారమే నడుస్తోందా? అని ప్రశ్నించారు. ఏపీలో పాలన వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యే డబ్బు కొట్టుకో.. బెల్ట్ పెట్టుకో అన్నట్లే ఉందన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు చేయడం లేదు కానీ.. మద్యం మాత్రం యధేచ్ఛగా సరఫరా అవుతుంది. బెల్ట్ షాపులుంటే తోలుతీస్తానన్న సీఎం చంద్రబాబు నాయుడు.. మద్యం ఆఖరికి బడ్డీ కొట్టుల్లో దొరుకుతున్నా మాట్లాడటం లేదు ఎందుకు? అని అడిగారు. శుక్రవారం మధ్యాహ్నం డిఫ్యాక్ట్ సీఎం లోకేష్ ను ఉద్దేశిస్తూ ఏపీలో ఉండడు' అని ఆరోపించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చూస్తే అపరిచితుడిలా కనిపిస్తాడని.. కొన్నిసార్లు దశావతారాల్లో కనిపిస్తాడని వ్యాఖ్యానించారు. తోలు తీస్తా.. తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు.. సమీక్షలు రాడు.. క్యాబినెట్ మీటింగ్ లకు కూడా రాడు అని ఆరోపించారు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోందని దుయ్యపట్టారు. ఈ మూడు నియోజవర్గాల్లో మద్యం విచ్చలవిడిగా దొరకుతోందని మండిపడ్డారు. బడ్డీ కొట్టులోని ఫ్రిజ్ లో మద్యం ఉంటుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.. అయిన రాష్ట్రాన్ని తీర్చుదిద్దుతామని ఎన్నికలో హామీలు ఇచ్చారు. వాటి గురించి ఎక్కడ ఏం మాట్లాడం లేదని ఫైర్ అయ్యారు. కానీ, ఈ ముగ్గురి నియోజకవర్గాల్లోని మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోందని విమర్శించారు. ఇది రాష్ట్రంలో పరిస్థితి' అంటూ పేర్ని నాని ఆరోపించారు.